జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 28 మందికి పైగా మరణించారు. ఇక ఉగ్రదాడి అనంతరం దేశంలో పరిస్థితులు ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. పలు నగరాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుతం హై అలర్ట్ ఉండడంతో పాటు కశ్మీర్ పర్యాటక రంగంపై చాలా ఎఫెక్ట్ పడింది. కశ్మీర్ టూర్‌కి వెళ్లాలి అనుకునే వారి ప్లాన్‌లను ప్రస్తుతం వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ పర్యాటక రంగానికి అండగా నిలిచాడు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి. ఉగ్రవాదులకు భారతీయులు భయపడరని చాటేందుకు, పర్యాటక రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు తన తర్వాతి సెలవులను కాశ్మీర్‌లోనే గడుపుతానని సునీల్ శెట్టి ప్రకటించారు. అలాగే ప్రజలందరూ తమ తర్వాతి సెలవులను కాశ్మీర్‌లోనే ప్లాన్ చేసుకోవాలని ఆయన కోరారు. “పౌరులుగా మనం ఒక్కటే చేయాలి. మన తర్వాతి సెలవులను కాశ్మీర్‌లోనే గడపాలని నిర్ణయించుకోవాలి. మనకు భయం లేదని వారికి చూపించాలి అని ఆయన అన్నారు. అవసరమైతే కాశ్మీర్‌ను సందర్శించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అధికారులకు తెలియజేసినట్లు కూడా సునీల్ శెట్టి వెల్లడించారు. సునీల్ శెట్టి రాబోయే సినిమాల్లో ‘కేసరి వీర్’ (2025), ‘వెల్కమ్ టు ది జంగిల్’ (2025), ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ (2025) ఉన్నాయి.
- April 26, 2025
0
79
Less than a minute
Tags:
You can share this post!
editor

