అందమైన అమ్మాయికి తండ్రిని కాను.. జావేద్ అక్తర్ సరదా వ్యాఖ్యలు

అందమైన అమ్మాయికి తండ్రిని కాను.. జావేద్ అక్తర్ సరదా వ్యాఖ్యలు

బాలీవుడ్ దిగ్గ‌జ లిరిక్ రైట‌ర్ జావేద్‌ అక్తర్‌, నటి, ఎంపీ కంగనా రనౌత్‌  మధ్య జరిగిన ఒక వివాదం ఇటీవ‌ల స‌ద్దుమణిగిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ మ‌ర‌ణించిన స‌మ‌యంలో తన పేరును అనవసరంగా ప్రస్తావించి, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ జావేద్ అక్తర్ 2020లో నటి కంగనా రనౌత్‌పై పరువు నష్టం దావా వేశారు. దీనికి ప్రతీకారంగా, కంగనా రనౌత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2016లో ఒక సహ నటుడికి క్షమాపణ చెప్పాలంటూ జావేద్ అక్తర్ తనను బెదిరించారని, తద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు కేసులు ఐదేళ్ల పాటు కోర్టులో నడిచాయి. అయితే ఈ రెండు కేసుల‌ను ఇటీవ‌ల కోర్టులో కొట్టివేయ‌డంతో పాటు కంగ‌నా జావేద్ అక్త‌ర్‌కి క్ష‌మాప‌ణ‌లు తెలిపింది. ఈ వివాదం గురించి తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు జావేద్ అక్త‌ర్. జావేద్ మాట్లాడుతూ.. కంగ‌నా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆరోజు ఉద‌యం మేము కోర్టులో కలుసుకున్నాం. జ‌డ్జి ఆమె నుండి ఏం కోరుకుంటున్నారు అని అడుగ‌గా.. నేను కేవలం క్షమాపణ మాత్రమే అడిగాను. దీంతో ఆమె జ‌డ్జి ముందు బేషరతుగా క్షమాపణ లేఖను రాసి సంతకం చేసింది. అంటూ జావేద్ చెప్పుకొచ్చాడు.

editor

Related Articles