బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మణిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ, అమీర్‌ఖాన్ ఏం మాట్లాడాడు అంటే.. ‘సౌత్‌లో నాకు మణిరత్నం సినిమాలు అంటే ఎప్పటి నుండో అభిమానం. నేను మణిరత్నం గారి సినిమాలకు అభిమానిని. చాలాసార్లు ఆయనతో కలిసి పనిచేయాలి అనుకున్నాను. చెన్నై వచ్చినప్పుడల్లా ఆయన్ను కలుస్తుంటాను. ఎన్నోసార్లు మేమిద్దరం కలిసి పనిచేయాలని అనుకున్నాం అని అమీర్ తెలిపాడు. అమీర్ ఇంకా మాట్లాడుతూ.. ‘మా ఇద్దరి కాంబోలో ‘లజో’ అనే సినిమా కూడా అనుకున్నాం. కానీ, అనుకోని కారణాలతో అది చేయలేకపోయాం. కానీ ఎప్పటికైనా మణిరత్నం గారితో ఆ సినిమా చేయాలని ఉంది. అది భవిష్యత్‌లో నెరవేరుతుందనే ఆశ నాకుంది. ఆయన మంచి విజనరీ. ఎలాంటి సినిమాలను అయినా చాలా బ్యాలెన్స్ చేయగలరు’ అంటూ అమీర్‌ఖాన్ మణిరత్నం గురించి క్రేజీ కామెంట్స్ చేశాడు.
- June 9, 2025
0
45
Less than a minute
Tags:
You can share this post!
editor

