హృతిక్‌తో ‘సలార్’ మేకర్స్ సినిమా ప్లాన్?

హృతిక్‌తో ‘సలార్’ మేకర్స్ సినిమా ప్లాన్?

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కి ఎప్పటినుండో తెలుగు ఆడియెన్స్ నుండి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్‌గా ‘వార్ 2’ తో అలరించిన హృతిక్ తర్వాత సినిమాగా భారీ నిర్మాణ సంస్థ హోంబళే సంస్థకు సినిమా చేస్తున్నాడు. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తుండగా ఈ కాంబినేషన్‌పై ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి వినిపిస్తోంది. దీని ప్రకారం మేకర్స్ ఈ హీరోతో ఒక మైథాలజీ బ్యాక్ డ్రాప్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి ఇది ఎంతవరకు నిజం అనేది వేచిచూడాలి. హృతిక్ రోషన్ నుండి మొదటి స్ట్రైట్ సౌత్ సినిమా ఇది, ఈ సినిమాపై అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. మరి సలార్, కేజిఎఫ్ మేకర్స్ ఇలాంటి హీరోతో ఎలాంటి ప్రాజెక్ట్‌ని ప్లాన్ చేస్తున్నారో వేచి చూడాల్సిందే.

editor

Related Articles