బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా క్రిష్ 4. ఈ సినిమాతోనే హృతిక్ రోషన్ మెగాఫోన్ పడుతున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ హీరో సినిమా క్రిష్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకు హాలీవుడ్ సూపర్ హీరోలు మాత్రమే తెలిసిన ప్రేక్షకులకు ఇండియన్ సూపర్ హీరోగా హృతిక్ రోషన్ అలరించాడు. కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 సినిమాలు రాగా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇప్పుడు ఇదే ఫ్రాంచైజీ నుండి క్రిష్ 4 రాబో తోంది. మొదటి మూడు పార్టులకు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించగా.. తాజాగా వచ్చే క్రిష్ 4కి హృతిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి ఒక క్రేజీ వార్త బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు.

- September 17, 2025
0
36
Less than a minute
You can share this post!
editor