60 రోజుల్లో సినిమా తీయాలి ఎలా: పూరి..?

60 రోజుల్లో సినిమా తీయాలి ఎలా: పూరి..?

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన తర్వాత సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో పూరి సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం పూరి సాలిడ్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కేవలం 60 రోజుల్లో షూటింగ్ పూర్తిచేయాలని పూరి ప్లాన్ చేస్తున్నాడట. దీనికోసం ఆయన అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే పేరు పెట్టాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ కథ మురికివాడలలో సాగనుండటంతో, దానికి తగ్గట్టుగా సెట్స్ వేసేందుకు పూరి జగన్నాథ్ లొకేషన్స్ పరిశీలిస్తున్నారట. ఇక ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. మరి నిజంగానే పూరి 60 రోజుల్లో సినిమాని కంప్లీట్ చేయగలరా, వెయిట్ అండ్ సీ.

editor

Related Articles