మలయాళంలో అనుష్క శెట్టి ఎంట్రీ ఎలా..!

మలయాళంలో అనుష్క శెట్టి ఎంట్రీ ఎలా..!

హీరోయిన్ అనుష్క శెట్టి ముఖ్య పాత్రలో నటించిన ‘ఘాటి’ సినిమాతో మరోసారి తెరమీదకు రావడానికి ఈ నెల 5న సిద్ధమవుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క మరో పవర్‌ఫుల్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అనుష్క మొదటిసారిగా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. రొజిన్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కథనార్ – ది వైల్డ్ సోర్సరర్’ అనే భారీ సినిమాలో అనుష్క నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోందని.. తొమ్మిదో శతాబ్దానికి చెందిన మాయాశక్తులు కలిగిన క్రైస్తవ పూజారి కథనార్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని మాలీవుడ్ వర్గాల నుండి ఒక వార్త. మరి ఈ సినిమాతో మలయాళంలో అనుష్క ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉండబోతోందో చూడాలి.

editor

Related Articles