హిట్ 4 హీరో.. ఏసీపీ వీర‌ప్ప‌న్‌గా చెన్నై సూప‌ర్ కింగ్ ఫ్యాన్

హిట్ 4 హీరో.. ఏసీపీ వీర‌ప్ప‌న్‌గా చెన్నై సూప‌ర్ కింగ్ ఫ్యాన్

హిట్ ఫ్రాంచైజీలో వ‌స్తున్న ప్ర‌తి సినిమా కూడా ప్రేక్ష‌కుల‌కి మంచి కిక్ ఇస్తుంది. నాని నిర్మాణంలో ఈ సినిమాలు రూపొందుతుండ‌గా, ప్ర‌తి సినిమా కూడా ఒక‌టిని మించి ఇంకోటి అనేలా ఉంది. హిట్‌1 లో విశ్వ‌క్ సేన్ న‌టించ‌గా, ఆ సినిమా చివ‌రిలో హిట్ 2 హీరో అడివి శేష్ అని రివీల్ చేశారు. ఇక ‘హిట్ 2’ క్లైమాక్స్ తర్వాత సీన్‌లో ‘హిట్ 3’లో హీరోగా అర్జున్ సర్కార్ పాత్ర హీరో నాని చేస్తున్న‌ట్టు రివీల్ చేశారు. హిట్ 3 సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే అమెరికాలో ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి. సినిమా చూసిన వారందరు కూడా సినిమాపై పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. ఇక ‘హిట్ 4’లో హీరోను ‘హిట్ 3’ ఎండింగ్‌లో చూపించ‌డం విశేషం. ‘హిట్ 4’లో హీరో కార్తీ అని కొన్ని రోజుల క్రితం సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జరిగింది. కార్తీకి సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేయడంతో ఆ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ‘హిట్ 4’లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిగా కార్తీ సందడి చేయనున్నారు. త్వరలో విడుదల కానున్న ‘వా వాతియార్’లోనూ ఆయనది పోలీస్ రోల్. అందులో కామెడీ చేయనున్నారు. అయితే కార్తీకి త‌మిళంతో పాటు తెలుగులోను క్రేజ్ ఉంది. ఆయ‌న చేస్తున్న హిట్ 4 సినిమా తెలుగుతో పాటు తమిళంలో సంద‌డి చేయ‌నుంది.

editor

Related Articles