ఆహాలో స్ట్రీమింగ్ ఔతున్న హీరోయిన్ హన్సిక హర్రర్ సినిమా

ఆహాలో స్ట్రీమింగ్ ఔతున్న హీరోయిన్ హన్సిక హర్రర్ సినిమా

హర్రర్ సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ మంచి ఆదరణ చూపిస్తున్నారు. ఇక డబ్బింగ్ సినిమాల్లో కూడా హర్రర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. హీరోయిన్ హన్సిక ముఖ్య పాత్రలో నటించిన ‘గార్డియన్’ సినిమా తమిళనాట గత ఏడాది రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను శబరి, గురు శరవణన్ సంయుక్తంగా డైరెక్ట్ చేశారు. హర్రర్ థ్రిల్లర్ సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘గార్డియన్’ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి ఆదరణ లభిస్తుందో అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాలో సురేశ్ చంద్ర మీనన్, శ్రీమన్, రాజేంద్రన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వెయిట్ అండ్ సీ.

editor

Related Articles