ఉగ్రదాడిని ఖండించిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ 

ఉగ్రదాడిని ఖండించిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ 

క‌శ్మీర్‌లోని పెహ‌ల్గామ్‌లో ఉగ్రవాదులు  ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. ఈ దాడిలో సుమారు 27 మంది టూరిస్ట్‌లతో పాటు ఒక కశ్మీరీకి చెందిన స్థానిక‌ వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి మనీశ్‌ రంజన్‌, ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ప్రకటించింది. అయితే ఈ విషాదంపై విజయ్ దేవరకొండ స్పందించారు. దాడిని ఖండిస్తూ మృతులకు ఆయన సంతాపం తెలిపారు. రెండేళ్ల క్రితం నేను పహల్గాంలో ఒక సినిమా షూటింగ్‌లో, సందడి, నవ్వుల మధ్య, మమ్మల్ని ఎంతో శ్రద్ధగా చూసుకున్న స్థానిక కశ్మీరీ ఫ్రెండ్స్‌తో కలిసి నా పుట్టినరోజును జరుపుకున్నాను. నిన్న జరిగిన ఘటన గుండెను కలచివేసేలా, కోపం తెప్పించేలా ఉంది. తమను ఒక శక్తిగా పిలుచుకుని, పర్యాటకులపై కాల్పులు జరపడం అత్యంత సిగ్గుమాలిన, అవమానకరమైన, పిరికిబంద చర్య. ఆయుధాల వెనుక దాక్కున్న ఈ మూర్ఖత్వం దుర్మార్గం. మేము బాధితులతో, వారి కుటుంబాలతో నిలబడతాము. మేము కశ్మీర్‌తో నిలబడతాము. ఈ పిరికివారిపై  త్వరగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదం ముందు తలవంచదంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ రాసుకొచ్చాడు.

editor

Related Articles