మరోసారి రిస్క్ తీసుకుంటున్న హీరో వరుణ్ తేజ్..?

మరోసారి రిస్క్ తీసుకుంటున్న హీరో వరుణ్ తేజ్..?

హీరో వరుణ్ తేజ్ ఇటీవల కాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఆయన నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్‌గా నిలవడంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఆయన ప్రస్తుతం దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో ఓ హర్రర్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ మరో డైరెక్టర్‌కు ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది. రైటర్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ సిరికొండ, రవితేజ హీరోగా వచ్చిన ‘టచ్ చేసి చూడు’ సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ కథను ఆయన వరుణ్ తేజ్‌కు వినిపించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మరో ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేయడంతో వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు నిజంగానే వరుణ్ ఓకే చెబుతాడా లేదా అనేది వేచి చూడాలి.

editor

Related Articles