హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భైరవం’ మే 30న రిలీజ్‌కి రెడీ అయింది. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన సినిమాతో ఇండియాను షేక్ చేస్తానని చెబుతున్నాడు ఈ హీరో. అయితే తాను చేయబోయే నెక్స్ట్ సినిమా ‘హైందవ’ గురించి ఆయన ఈ కామెంట్ చేశాడు. లుధీర్ బైరెడ్డి అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంటుందని.. దశావతారాల చుట్టూ ఈ సినిమా నడుస్తుందని.. ఈ సినిమా తన కెరీర్‌కి గేమ్ ఛేంజర్ అవుతుందని ఆయన అన్నాడు. తన నెక్స్ట్ సినిమాపై బెల్లంకొండ శ్రీనివాస్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండటం విశేషం. మరి భైరవం సినిమాతో ఈ హీరో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
- May 22, 2025
0
68
Less than a minute
Tags:
You can share this post!
editor

