హీరో చిరంజీవి.. ఇది ఒక పేరు కాదు బ్రాండ్. ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలకు పైగానే టాలీవుడ్‌లో చిరంజీవి ఎన్నో అవార్డులని కూడా అందిపుచ్చుకున్నారు. తాజాగా యుకే పార్లమెంట్ నుండి అరుదైన సత్కారం అందుకున్నారు. చిరంజీవికి యూకే పార్లమెంట్‌లోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌తో సత్కరించారు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో వేడుక జరిగింది. పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ తదితరులు పాల్గొని చిరంజీవికి అవార్డ్ అందించారు. చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించగా, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాలతో పాటు ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేసింది బ్రిడ్జ్ ఇండియా సంస్థ. ఇది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీ రూపకల్పనలో కృషి చేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు.. వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో ఇలా సత్కరిస్తూ ఉంటారు.
											- March 20, 2025
 
				
										 0
															 54  
															  Less than a minute 
										
				
			
				Tags:			
		You can share this post!
editor
				
