ఉగ్రదాడి ఘటనపై హీరో అజిత్‌ స్పందన

ఉగ్రదాడి  ఘటనపై  హీరో  అజిత్‌  స్పందన

పెహల్‌గామ్‌లో ఉగ్రదాడి ఘటనపై కోలీవుడ్‌ హీరో అజిత్‌ తాజాగా స్పందించారు. పర్యాటకులపై జరిగిన ఆ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అజిత్‌ పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. అనంతరం అజిత్‌ మాట్లాడుతూ.. పెహల్‌గామ్‌ ఉగ్రదాడిని ఖండించారు. ప్రజలంతా ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. కుల, మతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలన్నారు. పెహల్‌గామ్‌ వంటి దారుణమైన ఘటనలు దేశంలో మరోసారి జరగకూడదని ఆశిస్తున్నట్లు చెప్పారు. పద్మ అవార్డుల కార్యక్రమంలో సాయుధ దళాలను కలిసినట్లు చెప్పారు. వారి త్యాగాలను మెచ్చుకున్నారు. వారందరి కారణంగానే మనం ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నాం అంటూ అజిత్‌ చెప్పుకొచ్చారు.

editor

Related Articles