కోలీవుడ్ సినిమా దగ్గర సూపర్ క్రేజ్ ఉన్నటువంటి హీరోస్‌లో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి సినిమాల్లోనే కాకుండా బయట జీవితంలో కూడా అజిత్ రియల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. అయితే అజిత్ నుండి ఎప్పటి నుండో రావలసి ఉన్న సినిమా “విడా ముయర్చి” ఇపుడు రిలీజ్‌కి సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది అలానే ఎప్పుడో రిలీజ్‌కి రావాల్సి ఉంది. కానీ ఆలస్యం అవుతూ వచ్చింది. పైగా వచ్చిన కంటెంట్ కూడా మరీ అంత హిట్‌గా కూడా మారలేదు. అయినప్పటికీ ఇపుడు తమిళ నాట బుకింగ్స్ చూస్తే ఊహించని లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. అక్కడ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఇపుడు టిక్కెట్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లుగా కనిపిస్తున్నాయి. ఇదంతా డెఫినెట్‌గా అజిత్ స్టార్ పవరే అని చెప్పవచ్చు. మరి ఇలాంటి సినిమాకే ఈ రేంజ్ బుకింగ్స్ అంటే మంచి హైప్ ఉన్న భారీ సినిమా “గుడ్ బ్యాడ్ అగ్లీ” కి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు. అయితే తెలుగులో మాత్రం “విడా ముయర్చి” డబ్బింగ్ అయ్యి “పట్టుదల” గా వస్తుంది కానీ మన దగ్గర సినిమా డల్ గానే ఉంటుందేమో అనిపిస్తోంది. మరి ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే.

- February 4, 2025
0
8
Less than a minute
Tags:
You can share this post!
editor