Movie Muzz

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్‌డేట్‌ తీసుకొచ్చిన హరీష్ శంకర్!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్‌డేట్‌ తీసుకొచ్చిన హరీష్ శంకర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో రీజనల్‌గా మంచి హైప్ ఉన్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” అని చెప్పాలి. భీమ్లా నాయక్ సినిమా తర్వాత తన నుండి మరో పోలీస్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఇదివరకే కొంతమేర కూడా కంప్లీట్ అయ్యింది. అయితే ఈ షూటింగ్ మళ్ళీ పునః ప్రారంభం కాబోతుంది అని మేకర్స్ రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. ఇక లేటెస్ట్‌గా స్వయంగా దర్శకుడు హరీష్ శంకర్ నుండి కూడా ఒక సాలిడ్ అప్‌డేట్ వచ్చేసింది. దీనితో లేటెస్ట్‌గా హరీష్ శంకర్ మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ జూన్ రెండో వారం నుండి మొదలు కాబోతుంది అని క్లారిటీ ఇచ్చారు. సో ఉస్తాద్ ఇంకొన్ని రోజుల్లో సెట్స్‌లో దిగనున్నాడని చెప్పాలి. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

editor

Related Articles