పుష్ప‌2 ఘ‌టన దృష్ట్యా సంధ్య థియేట‌ర్‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ ర‌ద్దు

పుష్ప‌2 ఘ‌టన దృష్ట్యా సంధ్య థియేట‌ర్‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ ర‌ద్దు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “హరి హర వీర మల్లు” సినిమా ట్రైలర్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ట్రైలర్‌ను జులై 3వ తేదీ ఉదయం 11:10 గంటలకు గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో థియేటర్లలో ట్రైలర్ స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అభిమానుల్లో ట్రైలర్‌పై నెలకొన్న ఉత్సాహం చూస్తుంటే సినిమాని భారీ హిట్ చేసేలా క‌నిపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ సమీపంలోని సంధ్య థియేటర్‌లో కూడా ట్రైలర్ స్క్రీనింగ్ ప్లాన్ చేశారు. కాని అక్కడి పరిస్థితులు ఊహించనంతగా మారిపోయాయి. జులై 2న ఉదయం ఎంట్రీ పాస్‌ల కోసం భారీగా అభిమానులు గుమికూడడంతో, పరిస్థితి నియంత్రణకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, సంధ్య థియేటర్ యాజమాన్యం భద్రతా కారణాలతో ట్రైలర్ స్క్రీనింగ్‌ను రద్దు చేసింది. పుష్ప 2 సినిమా రిలీజ్ స‌మ‌యంలో అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీగా వచ్చిన అభిమానుల కారణంగా ఏం జ‌రిగిందో మ‌నంద‌రికీ తెలిసిందే. అందుకే సెక్యూరిటీ విషయంలో ఏ పొరపాటూ జరగకుండా చూసేందుకు థియేటర్ యాజమాన్యం, పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. సంధ్య ధియేట‌ర్‌లో ట్రైల‌ర్ స్క్రీనింగ్ క్యాన్సిల్ చేసిన హైదరాబాద్‌లోని ఇతర థియేటర్లలో ట్రైలర్ స్క్రీనింగ్ యథాతథంగా కొనసాగింది.

editor

Related Articles