హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుప‌తిలో జూన్ 8న..

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుప‌తిలో జూన్ 8న..

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుండి చాలా రోజుల త‌ర్వాత వ‌స్తున్న సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. ఈ సినిమా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అయితే ఈ రోజుల్లో ఓ పాన్ ఇండియన్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే .. కనీసం 2 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలవుతాయి. కానీ ఇక్కడ హరిహర వీరమల్లు విషయంలో సీన్ రివర్స్‌లో జరుగుతుంది. జూన్ 12న సినిమా విడుద‌ల కానుంది. ప్ర‌మోష‌న్స్ హ‌డావిడి పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. క‌నీసం ట్రైల‌ర్ కూడా విడుద‌ల కాలేదు. ట్రైలర్ కోస‌మైతే ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్‌కి ఇంకా 9 రోజుల సమయమే ఉన్న నేప‌థ్యంలో కీలకమైన ట్రైలర్ విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో అభిమానులే కాకుండా మిగతా ఆడియెన్స్‌కి సినిమా మధ్య దూరాన్ని ఇంకా పెంచినట్టుగా మారుతోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు నిర్వ‌హిస్తారా అని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా సినిమా ఈవెంట్ నిర్వ‌హిస్తారనే వార్త‌లు ఇటీవ‌ల వ‌చ్చాయి. అయితే ఈ వారాంతంలో ఒక భారీ ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తిరుప‌తిలోని ఎస్‌వీయూ తార‌క‌రామ క్రీడా మైదానంలో జూన్ 8న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌నున్నారు.

editor

Related Articles