హ్యాపీ బ‌ర్త్ డే స‌న్నీ లియోన్..

హ్యాపీ బ‌ర్త్ డే స‌న్నీ లియోన్..

ఒక‌ప్పుడు శృంగార తార‌గా యువ‌త‌కి ప‌రిచ‌యం ఉన్న స‌న్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. న‌టిగా, డ్యాన్స‌ర్‌గా అద‌ర‌గొడుతోంది. స‌న్నీ లియోన్ వాస్తవానికి భారత మూలాలున్న వ్యక్తని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు సన్నీ లియోన్ 44వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా అభిమానులు, ప్ర‌ముఖులు ఆమెకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌రి కొంద‌రు స‌న్నీ లియోన్ గురించి తెలుసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. స‌న్నీ లియోన్ బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా నటించింది. సన్నీ లియోన్ అస‌లు పేరు కరణ్ జిత్ కౌర్. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత ఆమె తన పేరును మార్చుకున్నారు. 2012లో ‘జిస్మ్ 2’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సన్నీ లియోన్‌, ఈ సినిమాతో స‌క్సెస్ అందుకోలేక‌పోయింది. ఆ తర్వాత 2013లో న‌టించిన ‘జాక్‌పాట్’ కూడా ప్లాప్ అయ్యింది. ఇక 2014లో రాగిణి MMS 2 లో న‌టించ‌గా, ఈ హర్రర్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. అయితే, దీనివల్ల సన్నీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఆ త‌ర్వాత స‌న్నీలియోన్ ఐటెం సాంగ్స్‌లో న‌టించడం ప్రారంభించింది. అప్పుడు కొంతపేరు సంపాదించుకుంది.

editor

Related Articles