నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా. అరుళనందు, మాథ్యో అరుళనందు ఆధ్వర్యంలో ఈ నిర్మాణ సంస్థ తమ మూడో చిత్రంగా ‘హైకు’ని ప్రకటించింది. నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ అరుళనందు పుట్టినరోజు (డిసెంబర్ 5) సందర్భంగా హైకు ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగు, తమిళ, మళయాళం భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ‘హైకూ’ చిత్రంలో ఏగన్ హీరోగా నటిస్తున్నారు. ఆయనతో పాటు కోర్ట్.. కోర్ట్ వర్సెస్ ఏ నోబడి ద్వారా గుర్తింపు పొందిన శ్రీదేవి అపల్ల, మిన్నల్ మురళి చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమిస్తే.. ఇదొక రొమాంటిక్ డ్రామా అని తెలుస్తుంది. యువతీ యువకుల్లోని అమాయకత్వంతో కూడిన ప్రేమ, విద్యార్థి జీవితంలో ఆశలు, వారు కనే కలల నేపథ్యంతో ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా రానుంది. రంగురంగుల కుర్చీలతో ఖాళీగా ఉన్న గ్యాలరీలో కూర్చున్న హీరో హీరోయిన్ మనకు కనిపిస్తున్నారు. వారి మధ్య చక్కటి కెమిస్ట్రీ మనకు పోస్టర్‌లో అందంగా కనిపిస్తోంది. ఆకాశంలో కనిపించే లవ్ సింబల్ టైటిల్‌ను సూచించే సున్నితమైన భావాన్ని తెలియజేస్తోంది. అలాగే హీరో హీరోయిన్ వెనుకగా కనిపిస్తోన్న ఫాలింగ్ సూన్ అనే లైన్ వారి ఎమోషనల్ జర్నీని సూచిస్తోంది.
- December 6, 2025
0
1
Less than a minute
You can share this post!
editor


