నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం’గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్బంగా ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా నుంచి ‘పైసా డుమ్ డుమ్’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు జీవన్ కుమార్ మాట్లాడుతూ..నా కెరీర్ లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ వస్తున్నాను. ఈ సినిమాలో కీ రోల్ చేశాను. డైరెక్టర్ గారు ‘గుర్రం పాపిరెడ్డి’ కథ చెప్పినప్పుడు ఇది నా కెరీర్ లో మరో కొత్త తరహా మూవీ అవుతుందని అనిపించింది. వెరైటీ కాస్ట్యూమ్స్ తో డిఫరెంట్ గా నా క్యారెక్టర్ డిజైన్ చేశారు. మంచి పొటెన్షియాలిటీ ఉన్న స్టోరీ. సినిమా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా అన్నారు. నటుడు రాజ్ కుమార్ కాసిరెడ్డి మాట్లాడుతూ .. సినిమా కొత్తగా ఉంటుంది, మీ అందరికీ కొత్త ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చూసిన సాంగ్ 20 పర్సెంట్ మాత్రమే. ఫుల్ సాంగ్ ఇంకా బాగుంటుంది అన్నారు. ళ్లను సపోర్ట్ చేస్తే మరిన్ని మూవీస్ చేసే ప్రోత్సాహం దక్కుతుంది అన్నారు.
- December 9, 2025
0
38
Less than a minute
You can share this post!
editor


