గుడ్‌ బ్యాడ్ అగ్లీ టీం: అజిత్‌ కుమార్‌, యోగిబాబు..

గుడ్‌ బ్యాడ్ అగ్లీ టీం: అజిత్‌ కుమార్‌, యోగిబాబు..

సినిమాలతో బిజీగా ఉన్న యాక్టర్లలో అజిత్ కుమార్‌ ఒకరు. అజిత్ నటిస్తోన్న యాక్షన్‌ డ్రామా గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్‌ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని టాలీవుడ్ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. చాలాకాలంగా కొత్త అప్‌డేట్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌ కోసం ఫొటో రూపంలో వార్తను షేర్ చేసింది అజిత్‌ కుమార్‌ టీం. అజిత్‌కుమార్‌, యోగిబాబు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌తో షూటింగ్ లొకేషన్‌లో దిగిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ అజిత్ టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..? షూట్‌ కోసం యూరోపియన్ కంట్రీ బల్గేరియాకు వెళ్లింది. గుడ్ బ్యాడ్ అగ్లీ షూట్‌ లొకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. కామెడీ సెన్సేషన్‌ యోగిబాబు, అజిత్ కుమార్‌తో అధిక్‌ రవిచంద్రన్ ఎలాంటి సన్నివేశాలు రెడీ చేస్తున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్‌. ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ మూవీని 2025 వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో నెగెటివ్‌ రోల్‌ కోసం బాలీవుడ్ యాక్టర్లు బాబీ డియోల్‌, జాన్ అబ్రహాం పేర్లు తెరపైకి రాగా ఫైనల్‌గా ఎవరున్నారనేది క్లారిటీ రావాల్సి ఉంది.

administrator

Related Articles