సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ సినిమా నిర్మాణం నుండే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా తెలుగు హీరో నాగార్జున నటిస్తుండటం విశేషం. దాంతో ఆయన అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ అతిథి పాత్రలో నటించడం మరో ఆకర్షణ. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 14న ‘కూలీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రతీకార నేపథ్యంలో స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించారని తెలిసింది. ఇందులో దేవాగా రజనీకాంత్, సైమన్ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. కాగా ఈ సినిమా తెలుగు హక్కులను ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రై లిమిటెడ్ సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తోందని, త్వరలో ప్రమోషన్స్ ఆరంభిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, రచన-దర్శకత్వం: లోకేష్ కనగరాజ్.
- June 27, 2025
0
126
Less than a minute
Tags:
You can share this post!
editor

