టాలీవుడ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా వైవిధ్యంగా ఉంటాయి. అయితే ఈ హీరో నుండి సినిమా వచ్చి చాలా కాలమవుతోంది. ప్రస్తుతం మనోడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి గూఢచారి సినిమాకు సీక్వెల్‌గా జీ2 కాగా, మరొకటి డెకాయిట్. ఈ రెండు సినిమాలు ఇప్పుడు షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో ముందుగా జీ2 మొదలు కాగా, ఆ సినిమా ఫస్ట్ రిలీజవుతుందని అందరూ అనుకున్నారు. కాని జీ2 కన్నా ముందు డెకాయిట్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్టు గ్లింప్స్ ద్వారా తెలియజేశారు. మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామాగా ‘డెకాయిట్’ రూపొందుతుండగా, దీనికి ఒక ప్రేమ కథ అనేది ట్యాగ్‌టైన్. షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా సినిమా నుండి గ్లింప్స్‌ను విడుదల చేశారు.

- May 26, 2025
0
48
Less than a minute
Tags:
You can share this post!
editor