రామ్‌చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్‌గా దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసమే అని అందరికీ తెలుసు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నుండి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ కొట్టాయి. అయితే రెండో సాంగ్‌గా వచ్చిన మాస్ సాంగ్ రా మచ్చా మచ్చా అయితే స్టార్ట్ అవ్వడమే చార్ట్ బస్టర్‌గా మొదలైంది. అయితే ఫస్ట్ జపాన్ ఆడియెన్స్‌లో వైరల్‌గా మారిన ఈ సాంగ్ ఇప్పుడు సౌత్ కొరియన్ ఆడియెన్స్‌ని ఊపేస్తోంది. మరి కొరియాకి చెందిన ప్రముఖ పాప్ సింగర్ పార్క్ మిన్ జున్ అనే సింగర్ తన టీంతో కలిసి రా మచ్చా మచ్చా సాంగ్ హుక్ స్టెప్‌ని వేశారు. దీంతో ఈ క్లిప్ సోషల్ మీడియాలో చరణ్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది. మొత్తానికి థమన్ మ్యూజిక్ చేసిన సాంగ్ భారీ హిట్ అయ్యిందనే చెప్పాలి.

- October 20, 2024
0
30
Less than a minute
Tags:
You can share this post!
administrator