సోషియో ఫాంటసీ సినిమా ‘గాలి’. రామ్ ప్రసాద్ గురజాడ, అంజలి, శ్రీకాంత్ పెరుమాండ్ల, చిన్ని, రోజారాణి, బి.వి.సుబ్బారెడ్డి ప్రధాన పాత్రధారులు. టి.రాము దర్శకత్వంలో చందా లక్ష్మీనారాయణ నిర్మించారు. ఇటీవల హైదరాబాద్ లో టీజర్ ను విడుదల చేశారు. కలి పురుషుడికి, అమ్మవారికి మధ్య జరిగే భీకర పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. డిసెంబర్ 25న చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాకి కెమెరా: కార్నె ప్రకాష్, సంగీతం: అనిల్ కుమార్.
- September 20, 2025
0
330
Less than a minute
You can share this post!
administrator

