14 ఏళ్ల తర్వాత గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డులు సంబురం

14 ఏళ్ల తర్వాత గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డులు సంబురం

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినీ అవార్డుల సంబురం నెలకొన్నది. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ అవార్డులను  ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను ఇప్పటికే విధివిధానాలను ప్రకటించిన సర్కార్‌.. సీనియర్‌ నటి జయసుధను అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా నియమించింది. మార్చి 13 నుండి అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది  జ్యూరీ.. గురువారం ఉదయం అవార్డులను ప్రకటించనుంది. ఉదయం 10 గంటలకు తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుతో కలిసి అవార్డుల జాబితాను వెల్లడించనున్నారు. 2014 నుంచి 2023 వరకూ ఒక్కో సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రానికి అవార్డు ఇవ్వనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు, జాతీయ సమైక్యత చిత్రం, ఫీచర్‌ ఫిల్మ్‌, బాలల చలనచిత్రం విభాగం, హెరిటేజ్‌, పర్యావరణం, చరిత్రపై తీసే సినిమాలకు పురస్కారాలు అందజేస్తారు. యానిమేషన్‌ ఫిల్మ్‌, తొలి ఫీచర్‌ ఫిల్మ్‌, డాక్యుమెంటరీ ఫిల్మ్‌, సోషల్‌ ఎఫెక్ట్‌ ఫిల్మ్‌, షార్ట్‌ ఫిల్మ్‌ విభాగాల్లోనూ గద్దర్​ అవార్డును ప్రదానం చేస్తారు. తెలుగు సినిమాపై విశ్లేషణాత్మక వ్యాసాలు, పుస్తకాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకూ గద్దర్ అవార్డును ఇస్తున్నారు. కాంతారావు, పైడి జయరాజ్‌, ఎం.ప్రభాకర్‌ రెడ్డి పేర్లతో అవార్డులను కొనసాగించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సినిమాలకు అవార్డులు ఇవ్వడం ఇదే తొలిసారి.

editor

Related Articles