‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌పై ఫుల్ హంగామా..

‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌పై ఫుల్ హంగామా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా కోసం ఫ్యాన్స్  ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. ప‌లు వాయిదాల తర్వాత ఈ సినిమాని జులై 24న విడుద‌ల చేస్తున్నారు. అయితే సినిమా ట్రైల‌ర్ కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న నేప‌థ్యంలో ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. జులై 3న ఉదయం 11:10 గంటలకు ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా ఈ ట్రైలర్‌ను థియేటర్లలో విడుదల చేయాలనే నిర్ణయంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం అవ‌ధులు దాటింది. ఇప్పటివరకు ట్రైలర్ అనగానే యూట్యూబ్ లేదా సోషల్ మీడియా వేదికలలో మాత్రమే చూసేవారు. కాని ఈసారి మాత్రం మేకర్స్ ట్రెండ్ బ్రేక్ చేశారు. ట్రైలర్‌ను ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లో 29 థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, చిత్తూరు, ఒంగోలు వంటి పెద్ద నగరాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ థియేటర్ల వద్దే ఈ ట్రైలర్‌ను చూడాలని ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కటౌట్లు, ఫ్లెక్సీలు, డీజే స్టెప్పుల‌తో పవన్ అభిమానులు పండుగలా జరుపుకోబోతున్నారు.

editor

Related Articles