తొలిసారి హిందీ సినిమాలో చోటు దక్కించుకున్న శ్రీలీల

తొలిసారి హిందీ సినిమాలో చోటు దక్కించుకున్న శ్రీలీల

‘పుష్ప-2’లో ఐటెం సాంగ్‌ ‘కిస్సిక్‌’ కథానాయిక శ్రీలీల జాతకాన్నే మార్చివేసింది. ముఖ్యంగా ఈ పాటతో ఉత్తరాది యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుందీ హీరోయిన్. దీంతో బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే యువహీరో ఇబ్రహీమ్‌ అలీఖాన్‌ సరసన ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది శ్రీలీల. ఆమెకిది తొలి హిందీ సినిమా. తాజాగా ఈ హీరోయిన్ బాలీవుడ్‌లో భారీ ఆఫర్‌ను దక్కించుకుంది. హీరో కార్తీక్‌ ఆర్యన్‌ సరసన హీరోయిన్‌గా నటించనుంది. అనురాగ్‌బసు దర్శకత్వం వహిస్తారు. తొలుత త్రిప్తి డిమ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేయగా.. చివరి నిమిషంలో ఆమెను తప్పించి శ్రీలీలను ఖరారు చేశారు. మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘ఆషికీ-3’లో అవకాశం రావడం పట్ల శ్రీలీల ఆనందం వ్యక్తం చేసింది. బాలీవుడ్‌లో తన కెరీర్‌కు బ్రేక్‌నిచ్చే చిత్రమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

editor

Related Articles