ఫుడ్ పాయిజ‌నింగ్‌.. 100 మందికి అస్వ‌స్థ‌త‌..

ఫుడ్ పాయిజ‌నింగ్‌.. 100 మందికి అస్వ‌స్థ‌త‌..

లేహ్: జ‌మ్మూ క‌శ్మీర్‌లోని లేహ్‌లో క‌లుషిత ఆహారం తిని 100 మంది సినీ కార్మికులు అస్వ‌స్థ‌త గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆ ఫిల్మ్ యూనిట్ వ‌ర్క‌ర్ల ఆరోగ్యం స్థిరంగా ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. ఆదివారం రాత్రి వేళ ఎస్ఎన్ఎం ఆస్ప‌త్రికి ఆ పేషెంట్ల‌కు తీసుకువ‌చ్చారు. తీవ్ర‌మైన క‌డుపునొప్పి, త‌ల‌నొప్పి, వాంతులు అవుతున్న‌ట్లు ఆ వ‌ర్క‌ర్లు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ఆ బృందం లేహ్‌లో ఉంది. ఆ కార్మికులు ఎవ‌రూ స్థానికులు కాదు. ఆ లొకేష‌న్‌లో సుమారు 600 మంది భోజ‌నం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశం నుండి ఆహార  శాంపిళ్ల‌ను విశ్లేష‌ణ కోసం సేక‌రించారు. ఫుడ్ పాయిజ‌నింగ్ జ‌రిగిన‌ట్లు ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు చెప్పారు. ట్రీట్‌మెంట్ ముగిసిన అనంతరం  చాలామంది రోగుల‌ను డిశ్చార్జ్ చేసిన‌ట్లు డాక్ట‌ర్ తెలిపారు.

editor

Related Articles