శృతిహాస‌న్ పోస్ట్ చూసి ఫ్యాన్స్‌కి కంగారు..?

శృతిహాస‌న్ పోస్ట్ చూసి ఫ్యాన్స్‌కి కంగారు..?

క‌మ‌ల్ హాస‌న్ కూతురు శృతి హాస‌న్ తెలుగులో గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో మంచి హిట్ కొట్టి ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ని అందిపుచ్చుకుంది. ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న శృతి సింగర్‌గా.. మ్యూజిక్ డైరెక్టర్‌గా.. హీరోయిన్‌గా కూడా సత్తా చాటుతోంది. సినిమాల్లో సక్సెస్ బాగానే ఉన్నా.. నిజ జీవితంలో రిలేషన్‌ల విషయంలో మాత్రం బొక్క బోర్లా ప‌డింది. ఇప్పటివ‌ర‌కు ముగ్గురితో ప్రేమాయ‌ణం న‌డిపింది. ఆ మూడు ల‌వ్ స్టోరీలు ఫెయిల్యూర్ అయ్యాయి. సినిమాల కన్నా కూడా శృతిహాస‌న్ ఈ మూడు రిలేష‌న్స్‌తోనే ట్రెండింగ్‌లో నిలిచింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన శృతి హాస‌న్.. నేను నా రిలేషన్స్‌లో చాలా నిజాయితీగా ఉన్నాను. ఆ రిలేషన్స్ ఫెయిల్ అయినపుడు నా లవర్స్‌ను తప్పుబట్ట‌డం లేదు కానీ, నా బ్రేకప్స్ నుండి చాలా నేర్చుకున్నాను. అవి నా ఎదుగుదలకు ఉపయోగపడతాయి అంటూ ఉపోద్ఘాతం చెప్పుకొచ్చింది. చెన్నై నుండి ముంబై వెళ్లి అక్క‌డ ఎన్నో బాధ‌లు ప‌డ్డాము. తాజాగా త‌న ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు కంగారు ప‌డుతున్నారు. శృతి ఏదో ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టు పేర్కొంది. కాని త‌న‌కు వ‌చ్చిన వ్యాధి ఏంటో మాత్రం బయట పెట్టలేదు. శృతి పెట్టిన పోస్ట్ మాత్రం అభిమానుల‌ని తెగ కంగారు పెట్టేస్తోంది.

editor

Related Articles