‘అఖండ-2’తో తెలుగు ఫీల్డ్‌కి ఎంట్రీ

‘అఖండ-2’తో తెలుగు ఫీల్డ్‌కి ఎంట్రీ

సల్మాన్‌ఖాన్‌ ‘బజరంగీ భాయిజాన్‌’ సినిమాలో బాలనటి మున్ని పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది హర్షాలీ మల్హోత్రా. ప్రస్తుతం కొన్ని హిందీ సినిమాలు చేస్తున్న ఈ భామ ‘అఖండ-2’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో ఆమె జనని అనే కీలక పాత్రలో కనిపిస్తోందని చిత్రబృందం తెలిపింది. బుధవారం హర్షాలీ మెహతా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె సంప్రదాయ వస్త్రధారణలో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ-2’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మాతలు. సంయుక్త హీరోయిన్. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. దసరా కానుకగా సెప్టెంబర్‌ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకి సంగీతం: తమన్‌.

editor

Related Articles