సోష‌ల్ మీడియాలో ‘3 రోజెస్‌’ ట్రెండ్ అవుతున్న డైలాగుల‌తో వినోదం..

సోష‌ల్ మీడియాలో ‘3 రోజెస్‌’ ట్రెండ్ అవుతున్న డైలాగుల‌తో వినోదం..

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు టాక్ షోలు, వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్షకుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. కొన్నాళ్ల కింద‌ట ఆహాలో వ‌చ్చిన 3 రోజెస్ వెబ్ సిరీస్ ఎంత వినోదం పంచిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సిరీస్ బాగా క్లిక్ అవ‌డంతో ఈ సిరీస్‌ను ఆడియ‌న్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ సిరీస్‌కి సీక్వెల్ ఎప్పుడు వ‌స్తుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. వారి కోసం 3 రోజెస్ సీజ‌న్ 2 కు సంబంధించిన ఓ టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తూ టీమ్ స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం సోష‌ల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోన్న డైలాగులతో ఈ టీజర్ న‌వ్వులు పూయిస్తుంది. కొన్నాళ్లుగా సినిమాలతో అలరిస్తోన్న స‌త్య‌.. ఇప్పుడు ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. ఈషా రెబ్బా, హర్ష, సత్య ప్రధానపాత్రల్లో రూపొందుతోన్న సిరీస్‌ ‘3 రోజెస్‌’ సీజన్ 2 టీజ‌ర్‌లో సత్య పాత్రను పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సిరీస్‌లో ఆయన బెట్టింగ్‌ భోగి పాత్రలో కనిపించనున్నారు. ఆహా వేదికగా ఇది త్వరలోనే స్ట్రీమింగ్‌ కానుంది.  కిరణ్‌ కారవల్ల దర్శకత్వంలో ఇది రూపొందుతుండ‌గా, ఇది ప్రేక్ష‌కుల‌కి మంచి కామెడీ పంచింది అనే చెప్పాలి.

editor

Related Articles