ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓహారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నిసినిమాలు చేసినా, నా ప్రతి సినిమా తొలిసినిమాలా భావిస్తాను. ఈషా దర్శకుడు శ్రీనివాస్ నాకు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు. సినిమా అంటే ఎంతో పాషన్ ఉన్న వ్యక్తి, ఎంతో ఓపిక, ప్రతిభ ఉన్న దర్శకుడు. 24 క్రాఫ్ట్స్‌పై పట్టు ఉన్న వ్యక్తి. వాసు, వంశీ నాకు సోదరుల లాంటి వారు.
- December 4, 2025
0
3
Less than a minute
You can share this post!
editor


