జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ “డ్రాగన్”. కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్న చిత్ర బృందం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు భారీ షెడ్యూళ్లు పూర్తయ్యాయి. లీకైన ఔట్‌పుట్ చూసి ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. మొదట “డ్రాగన్” సినిమాను ఒకే భాగంగా తెరకెక్కించాలని అనుకున్న మేకర్స్, ఇప్పుడు రెండు పార్ట్స్‌గా ప్లాన్ చేసినట్టు సమాచారం. కథలో ఉన్న కంటెంట్‌ను దృష్టిలో ఉంచుకుని, రెండు భాగాలుగా తీసిన కూడా సినిమాకు నష్టం ఉండదని యూనిట్ భావిస్తోందట.
ఇక, ప్రశాంత్ నీల్‌కి రెండు భాగాల సినిమాలపై ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన “కేజీఎఫ్” ఫ్రాంచైజీ రెండు భాగాలుగా వచ్చి భారీ విజయం సాధించింది.ఆ తర్వాత ప్రభాస్‌తో చేసిన “సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్” కూడా మంచి హిట్‌గా నిలిచింది.

