దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. భాగ్యశ్రీబోర్సే హీరోయిన్. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా ఆంథమ్ ‘రేజ్ ఆఫ్ కాంత’ను విడుదల చేశారు. 1950 నాటి మద్రాస్ సినిమా స్వర్ణయుగం నేపథ్యంలో రూపొందిస్తున్న సినిమా ఇదని, అప్పటి ప్రజల జీవితానికి అద్దంపడుతుందని మేకర్స్ తెలిపారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాలో హృదయాల్ని కదిలించే అద్భుతమైన ప్రేమకథ ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ సినిమాకి సంగీతం: ఝను చంతర్, నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ తదితరులు.
 
											- October 31, 2025
				
										 0
															 47  
															  Less than a minute 
										
				
			You can share this post!
editor
				

 
											 
											