దుల్కర్ సల్మాన్ 41లో బాహుబలి స్టార్..?

దుల్కర్ సల్మాన్ 41లో బాహుబలి స్టార్..?

మాలీవుడ్ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ కు తెలుగులో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. DQ41 (వర్కింగ్‌ టైటిల్‌)తో వస్తోన్న ఈ సినిమాను టాలీవుడ్ లీడింగ్‌ బ్యానర్‌ ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ఫిమేల్‌ లీడ్ రోల్ లో నటిస్తోందని ఇటీవలే ప్రకటించారు మేకర్స్‌. కాగా మేకర్స్ ఇప్పుడు మరో క్రేజీ అనౌన్స్ మెంట్ చేశారు. బాహుబలి నటి‌ రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. రమ్యకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. బాహుబలి ప్రాంచైజీలో శివగామి లాంటి పవర్‌ ఫుల్ రోల్ తో గ్లోబల్‌ బాక్సాఫీస్ ను షేక్ చేసింది రమ్యకృష్ణ. ఇంతకీ రమ్యకృష్ణ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి ఇంకా ఏమీ తెలియదు. ఈ సినిమాతో రవి నేలకుడిటి డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం DQ41 షూటింగ్ దశలో ఉంది.

editor

Related Articles