మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ‘లోకా – 1 – చంద్ర’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన వారం రోజులకే రూ.101 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మలయాళం జానపదం నుండి తీసుకున్న కథ ఆధారంగా దానికి సూపర్ ఉమెన్ స్టోరీని జోడించి హిట్‌ను అందుకున్నాడు దర్శకుడు డామినిక్ అరుణ్. కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో సూపర్‌హీరోగా నటించగా.. ప్రేమలు నటుడు నస్లెన్ కె. గఫూర్ హీరోగా నటించాడు. ఈ సినిమా కేవలం మలయాళంలోనే కాకుండా, తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. మలయాళ పరిశ్రమలో ఇంత తక్కువ సమయంలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల్లో ఇది ఒకటి కాగా.. మహానటి, రుద్రమదేవి వంటి సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సౌత్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమా రికార్డు సృష్టించింది.

- September 4, 2025
0
50
Less than a minute
You can share this post!
editor