పూనమ్ కౌర్‌కు ఏమైనా హెల్త్ కంప్లైంట్స్ ఉన్నాయా?

పూనమ్ కౌర్‌కు ఏమైనా హెల్త్ కంప్లైంట్స్ ఉన్నాయా?

ఒకప్పుడు టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన సినిమాలలో న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకుంది పూన‌మ్ కౌర్, తాజాగా ఆమె ఏపీ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ఓ బహుమతిని కూడా ఇచ్చారు పూనమ్ కౌర్. ఆమె అందించిన కానుక సాంప్రదాయ పటచిత్ర కళను ఆధారంగా చేసుకొని ఉంది. ఇందులో అమరావతి అభివృద్ధిని ప్రతిబింబించే దృశ్యాలతో పాటు, ఆ ప్రాంతం కలల రాజధానిగా ఎలా మారుతోందో కళాత్మకంగా వివరించబడింది. కళ, కథనం, భావోద్వేగాల సమ్మేళనంగా ఆర్ట్ వ‌ర్క్‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు చాలా ఆస‌క్తిగా గ‌మనించారు. అయితే చాలారోజుల త‌ర్వాత ఈ కార్య‌క్ర‌మంలో క‌నిపించిన పూన‌మ్ చాలా లావుగా ఏదో అనారోగ్య స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్న‌ట్టుగా ఉన్నదనిపిస్తోంది. ఈ క్ర‌మంలో నెట్టింట అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ నేప‌థ్యంలో పూనమ్‌కౌర్ తన హెల్త్‌ గురించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన ఆరోగ్యం ఏమీ బాగా లేదని, ఫుడ్ ఎలర్జీ వచ్చిందని పూనమ్ చెప్పుకొచ్చింది. ఈవెంట్‌లో పాల్గొనే ముందు ఆమె ఆరోగ్యం ఏమీ బాగా లేదంట. ఫుడ్ ఎలర్జీతో బాధపడుతూ ఉందట. అంతే కాకుండా ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో త‌న‌కి ఇబ్బందులు ఎదురయ్యాయ‌ని పూన‌మ్ పేర్కొంది.

editor

Related Articles