ముప్పై ఏళ్ళ క్రితం ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రంభ. ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ కావడంతో రంభకు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి, సల్మాన్ ఖాన్, రజనీకాంత్, విజయ్, తదితర పెద్ద నటులతో నటించింది రంభ. అయితే కొన్నేళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉంటున్న ఆమె తాజాగా రీఎంట్రీకి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా తాను సినిమాలకు ఎందుకు దూరం అయ్యాను అనే విషయాన్ని షేర్ చేసింది. పెళ్లి తర్వాత కెనడాలో సెటిల్ అయ్యానని తెలిపిన రంభ, తల్లిగా పిల్లల బాధ్యతల కారణంగా సినిమాలకు దూరమైనట్లు చెప్పారు. తనకు 14, 10 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలతో పాటు 6 ఏళ్ల కుమారుడు ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం వారు తమ పనులు తాము చేసుకునే స్థితిలో ఉన్నారని వెల్లడించారు. సినిమాలపై తనకున్న ఆసక్తి గురించి తన భర్తకు తెలుసని, అందుకే మళ్లీ నటించాలన్న తన నిర్ణయాన్ని ఆయన సమర్థించారని రంభ తెలిపారు. ఇటీవల ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరించినట్లు చెప్పిన ఆమె, తొలుత భయపడినప్పటికీ, ఆ షో విజయవంతంగా సాగిందని, ప్రేక్షకుల చప్పట్లు తనలో ఉత్సాహాన్ని నింపాయని పేర్కొన్నారు.
- April 22, 2025
0
70
Less than a minute
Tags:
You can share this post!
editor

