హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి గ్రాండ్ సక్సెస్ అందుకున్నాయో మనం చూశాం. ఈ సినిమాలను ప్రముఖ నిర్మాత నాగవంశీ ప్రొడ్యూస్ చేశారు. అయితే, ఈ సినిమాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ కూడా ఉంటుందని గతంలోనే వెల్లడించారు. ఇక తాజాగా ఈ ‘టిల్లు క్యూబ్’ సినిమాకి ఎవరు డైరెక్షన్ చేస్తారనే విషయంపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ శంకర్ ‘టిల్లు క్యూబ్’ సినిమాని కూడా డైరెక్ట్ చేస్తారని ఆయన తెలిపారు. దీంతో ‘టిల్లు క్యూబ్’ సినిమాపై కూడా అంచనాలు అప్పుడే క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వర్క్స్ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని నిర్మాత ప్రకటించడంతో ఇప్పుడు అందరి చూపు ‘టిల్లు క్యూబ్’పై పడింది.
- March 1, 2025
0
62
Less than a minute
Tags:
You can share this post!
editor

