టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ‘క’ హీరో శుభవార్త చెప్పారు. తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన భార్య రహస్య గోరక్ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు కిరణ్ అబ్బవరం-రహస్య గోరక్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, కిరణ్ అబ్బవరం – రహస్య గోరక్ గతేడాది ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ‘రాజావారు రాణిగారు’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక తొలి సినిమాతోనే కిరణ్, రహస్య గోరక్ ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

- January 21, 2025
0
105
Less than a minute
Tags:
You can share this post!
editor