అక్కినేని నాగార్జున – అమల దంపతుల కుమారుడు అఖిల్ వివాహం ఇటీవల జైనాబ్ రవ్జీతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 6వ తేదీన హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో వీరి వివాహం గ్రాండ్‌గా జరిపారు నాగార్జున. ఇక వివాహం తర్వాత జూన్ 8వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ – జైనాబ్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు హాజరై నూతన జంటని ఆశీర్వదించారు. ఇక పెళ్లి తర్వాత అఖిల్, జైనబ్‌లకి సంబంధించిన అనేక విషయాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అఖిల్‌కి 30, అతని కన్నా జైనబ్ 9 ఏళ్లు పెద్దది అని కూడా చెబుతున్నారు. ఇక ఈ ఇద్దరి ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి కూడా నెట్టింట పలు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అఖిల్ తన ప్రాథమిక విద్యను చైతన్య విద్యాలయంలో ప్రారంభించాడు. అనంతరం రెండు సంవత్సరాలు ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి, హైదరాబాద్‌లోని ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో తన స్కూలింగ్ పూర్తి చేశాడు. అఖిల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా నుంచి BBA డిగ్రీ పొందాడు. విద్యను పూర్తిచేసిన అనంతరం, సినిమాల్లో ప్రవేశించాలనే లక్ష్యంతో న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. ఇక జైనబ్ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లోని గీతాంజలి స్కూల్, నాజర్ స్కూల్లో చదువుకుంది. తరువాత హ్యామ్‌స్టెక్ కాలేజ్‌లో లలిత కళలలో డిగ్రీ పూర్తిచేసింది. ఆమె ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్, పర్ఫ్యూమ్ మేకర్, బ్లాగర్. కేవలం 7 ఏళ్ల వయసులోనే పెయింటింగ్ ప్రారంభించిన జైనబ్, ప్రముఖ కళాకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ వద్ద శిక్షణ పొందింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఆమె ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘రిఫ్లెక్షన్స్’ పెద్ద విజయాన్ని సాధించింది. వన్స్ అపాన్ ద స్కిన్’ అనే బ్లాగ్‌ను కూడా నడుపుతోంది.
- June 17, 2025
0
48
Less than a minute
Tags:
You can share this post!
editor

