రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న సినిమా స్పిరిట్. ఈ సినిమా ఇంకా మొదలే కాలేదు, కాని ఈ సినిమా గురించి నిత్యం అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి. యానిమల్ హీరోయిన్ ఫైనల్ అయ్యాక స్పిరిట్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి అని అఫీషియల్‌గా ప్రకటించాడు. త్రిప్తి డిమ్రికి యానిమల్‌లో అవకాశం ఇచ్చిన సందీప్ ఇప్పడు ప్రభాస్ స్పిరిట్‌లోను అవకాశం ఇవ్వడంతో హీరోయిన్ ఆనందానికి అవధులు లేవు. త్రిప్తి డిమ్రీకి యానిమల్ సినిమాలో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక స్పిరిట్‌లోనూ అది కూడా హీరో ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ ఇవ్వడంతో ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. యానిమల్ నటి త్రిప్తి డిమ్రీకి స్పిరిట్‌లో ఆఫర్ ఇచ్చారు సందీప్. అయితే ఈ సినిమాకి త్రిప్తికి ఏకంగా 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే త్రిప్తి జాక్‌పాట్ కొట్టేసినట్టే. ఇక సినిమా ఆఫర్ రావడం పట్ల త్రిప్తి సంతోషం వ్యక్తం చేస్తూ నెట్టింట పోస్ట్ పెట్టింది. ఈ ప్రయాణంలో నన్ను నేను వెతుక్కుంటున్నాను… ఈ ప్రయాణంలో నాపై నమ్మకం ఉంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సందీప్ రెడ్డి వంగా. మీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గౌరవంగా ఉంది అని రాసుకొచ్చింది.
- May 28, 2025
0
145
Less than a minute
Tags:
You can share this post!
editor

