ఒకప్పుడు మంచి విజయాలతో ప్రేక్షకులని ఎంతగానో థ్రిల్‌కు గురిచేసిన నితిన్ ఈ మధ్య సరైన సక్సెస్‌లు అందుకోలేకపోతున్నాడు. చివరిగా వచ్చిన రాబిన్ హుడ్ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇప్పుడు తమ్ముడు అనే సినిమాతో పలకరించబోతున్నాడు. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జులై 4న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో ఒకప్పటి హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తోంది. లయ ఈ సినిమాలో నితిన్‌కి అక్క పాత్రలో కనిపించనుంది. ఇక లయకు కూతురిగా, నితిన్‌కి మేనకోడలుగా ఈ సినిమాలో ఒక పాప నటిస్తోంది. ఈ సినిమాలో నితిన్‌కి మేనకోడలుగా నటిస్తున్న పాప ఎవరనే ఆసక్తి అందరిలో ఉంది. ఆ పాప పేరు దీత్య. ఈ పాప ఎవరో కాదు తమ్ముడు సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూతురే. వేణు శ్రీరామ్ గతంలో పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ డైరెక్ట్ చేయగా ఇప్పుడు నితిన్‌తో తమ్ముడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తన కూతురు దీత్యని నటింపచేస్తున్నాడు. దీత్య కూడా ప్రమోషన్స్‌లో పాల్గొని తన క్యూట్ మాటలతో అందరినీ అలరిస్తోంది. పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటోంది. తన తండ్రిలాగే తనకు కూడా పవన్ కళ్యాణ్ తన ఫేవరేట్ హీరో అని చెప్పింది. ఈ సినిమా తర్వాత కూడా దీత్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. తమ్ముడు సినిమాలో లయకు కూతురిగా, నితిన్‌కి మేనకోడలుగా దీత్య ఎలా మెప్పిస్తుందో చూడాలి.

- June 25, 2025
0
72
Less than a minute
Tags:
You can share this post!
editor