Movie Muzz

విజయేంద్ర ప్రసాద్‌తో డైరెక్టర్ పూరి మీట్

విజయేంద్ర  ప్రసాద్‌తో  డైరెక్టర్  పూరి  మీట్

మన టాలీవుడ్ సినిమా దగ్గర నుండి వచ్చిన పాన్ ఇండియా ఇంకా పాన్ వరల్డ్ లెవెల్ సెన్సేషనల్ హిట్స్ సినిమాల్లో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళివే ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఈ దర్శకునికి అంత పవర్‌ఫుల్ కథలని అందించే రచయిత తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి కూడా అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి రచయిత తన కొడుకు, గ్లోబల్ దర్శకుడు రాజమౌళి వర్క్ కంటే డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ వర్క్ అంటే ఎంతో ఇష్టం అని అనేక సందర్భాల్లో చెప్పారు. మరి లేటెస్ట్‌గా పూరి జగన్నాథ్ అలాగే విజయేంద్ర ప్రసాద్ కలిసిన పిక్ ఒకటి బయటకి వచ్చి వైరల్‌గా మారింది. వారితో పాటుగా నిర్మాత అలాగే నటి ఛార్మి కూడా కనిపిస్తుంది. దీనితో వీరి ముగ్గురు కలయిక ఇపుడు వైరల్‌గా మారింది. మరి వీరి కలయిక వెనుక అసలు కారణం ఏంటి అనేది రివీల్ చేయనున్నాము.

editor

Related Articles