పూరి జగన్నాథ్ నెక్ట్స్ సినిమా గోపీచంద్‌తో ఉంటుందట. పూరి, గోపీచంద్ కలిసి 2010లో ‘గోలీమార్’ సినిమా చేశారు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారట. అక్కడ కొత్త కథకోసం కసరత్తులు చేస్తున్నారని వినికిడి. అయితే.. ఆయన నెక్ట్స్ సినిమా ఏ హీరోతో అనేది మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయితే.. తాజాగా ఈ విషయంపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అప్పట్లో గోలీమార్ సినిమా బాగానే ఆడింది. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారనేది ఒక వార్త. ఇది ‘గోలీమార్’కు సీక్వెల్‌గా ఉంటుందని కూడా అంటున్నారు. ‘గోలీమార్’లో హీరో క్యారెక్టరైజేషన్ బావుంటుంది. దానిచుట్టూ కొత్త కథను నడపొచ్చని పూరి భావిస్తున్నట్టు ఫిల్మ్‌వర్గాల టాక్. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది మూడు సినిమాలు నిర్మించాలనేది ఆయన ప్లాన్. వాటిలో ‘గోలీమార్ 2’ ఒకటని సమాచారం.

- December 13, 2024
0
107
Less than a minute
You can share this post!
editor