‘దిల్‌రూబా’ పోస్ట్‌పోన్డ్-మార్చి 14 రిలీజ్!

‘దిల్‌రూబా’ పోస్ట్‌పోన్డ్-మార్చి 14 రిలీజ్!

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న రాబోయే సినిమా ‘దిల్‌రూబా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విశ్వ కరుణ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుంది. ఈ సినిమాను తొలుత ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఇప్పుడు మార్చి 14న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక నెల తర్వాత ఈ సినిమాను తీసుకొచ్చేందుకు సినిమా యూనిట్ సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో రుక్సర్ ఢిల్లోన్ హీరోయిన్‌గా నటిస్తుండగా సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

editor

Related Articles