దిల్‌రాజు భార్య బాగా చ‌దువుకున్నావిడే.. పెళ్ల‌య్యాక కూడా కంటిన్యూ..

దిల్‌రాజు భార్య బాగా చ‌దువుకున్నావిడే.. పెళ్ల‌య్యాక కూడా కంటిన్యూ..

దిల్ రాజు ఇండ‌స్ట్రీలో టాప్ ప్రొడ్యూస‌ర్. ఇటీవ‌ల దిల్ రాజు డ్రీమ్స్ అనే వెబ్ సైట్‌ని లాంచ్ చేశాడు. పరిశ్రమకు పరిచయం కావాలనుకునే వారికి ఇది సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో ఈ ‘దిల్‌రాజు డ్రీమ్స్‌’ అనే వెబ్‌సైట్‌ని స్టార్ట్‌ చేశాం అని దిల్‌రాజు తెలిపారు. మొదటి భార్య చనిపోయిన తర్వాత తేజ‌స్విని అనే యువ‌తిని వివాహం చేసుకున్నారు. ఇటీవ‌ల ఆమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ టాపిక్‌గా మారుతోంది. దిల్ రాజు భార్య తేజ‌స్విని గతంతో పోల్చితే తన వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిపరమైన విషయాలల్లోనూ ఓపెన్‌గా మాట్లాడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. ఇటీవల భర్తతో కలిసి పారిస్‌ వెకేషన్‌కి వెళ్లిన సందర్భంగా అక్కడి ఫొటోలు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌చేసి నెటిజన్లను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా, పెళ్లి తర్వాత తొలిసారి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజస్విని తన చదువు, కెరీర్, ప్రేమ, పెళ్లి వంటి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. “హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. నా విద్యాభ్యాసం మొత్తం గర్ల్స్ ఇన్‌స్టిట్యూషన్లలోనే సాగింది. స్కూలింగ్‌ సెయింట్ ఆన్స్‌లో, ఇంటర్‌ శ్రీచైతన్యలో పూర్తయ్యింది. డిగ్రీను కస్తూరిబా గాంధీ కళాశాలలో చేసి, నాచారంలోని సెయింట్ పియస్ కళాశాలలో బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తిచేశాను. మా అమ్మ హైకోర్ట్ అడ్వకేట్. ఆమెను చూసి నాకు కూడా లా పట్ల ఆసక్తి వచ్చింది. అందుకే పీజీ తర్వాత పెండేకంటి లా కాలేజీలో లా చదవడం ప్రారంభించాను. ఆ సమయంలోనే దిల్ రాజు గారితో వివాహమైంది. పెళ్లి తర్వాత కూడా చదువుతూనే 2024లో లా పూర్తి చేశాను. నేనొక మంచి స్టూడెంట్‌నని గర్వంగా చెప్పగలను అని తేజస్విని చెప్పారు.

editor

Related Articles