ప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురించి ఈమధ్య సోషల్ మీడియాలో పలు పుకార్లు ప్రచారం అవుతున్నాయి. ఈ వార్తలపై నిర్మాత దిల్ రాజు అధికారిక స్పందన విడుదల చేశారు. “రాబోయే సినిమాలపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. పాత ఊహాగానాలకు, కొత్త విషయాలను కలిపి కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం ప్లాన్ అవుతోందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ప్రాథమిక పనులు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు త్వరలోనే తమ సంస్థే అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పారు. “మా టీమ్ నుండి అధికారికంగా సమాచారం వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణలకు రావద్దని, ధృవీకరించని వార్తలను మీడియా లో ప్రచారం చేయవద్దని కోరుతున్నాము. దయచేసి పుకార్లు వ్యాప్తి చేయకుండా, నిజమైన సమాచారాన్ని మాత్రమే పంచండి” అని దిల్ రాజు మీడియా మిత్రులను అభ్యర్థించారు. ఈ ప్రకటనతో ప్రొడక్షన్ హౌస్‌పై వస్తున్న వార్తలకు స్పష్టత వచ్చి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
- December 3, 2025
0
58
Less than a minute
You can share this post!
editor


